SBI PO NOTIFICATION IN TELUGU భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ SBI నందు అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 తెలుగులో

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) గురించి

SBI PO NOTIFICATION IN TELUGU

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశం అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థగా 200 సంవత్సరాలు వైభవమైన చరిత్ర కలిగి ఉంది ఇది భారతీయుల నమ్మకాన్ని పొందిన విశ్వసినీయమైన బ్యాంకు. దీని యొక్క ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ఎస్బిఐ ఫార్చ్యూన్ 500 కంపెనీల జాబితాలో చేరి గోబ్ల స్థాయిలో ప్రాముఖ్యత కలిగిన కంపెనీ. ప్రస్తుతం రూ 61 ట్రిలియన్లు ఆస్తి విలువతో ఉంది. 50 కోట్లకు పైగా కస్టమర్లు సేవలందించుచున్నది మరియు 29 విదేశాలలో ఈ బ్యాంకు సేవలందిస్తుంది అలాగే ఈ బ్యాంకుకు అనుబంధ సంస్థలు ఎస్బిఐ జనరల్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ మ్యూచువల్ ఫండ్ కంపెనీలు కలవు. https://telugugovtjobsinfo.com/sbi-po-notification-in-telugu/

నోటిఫికేషన్ వివరములు

బ్యాంకింగ్ సెక్టార్ నందు ఉద్యోగం చేయాలనుకునే ప్రతి ఒక్క అభ్యర్థికి SBI నందు ఉద్యోగం చేయాలని కలగా ఉంటుంది. ఈ కలను నిజం చేసుకొనుటకు అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగ సంపాదించుటకు 600 ఉద్యోగాలకు పైగా నోటిఫికేషన్ జారీ చేయడమైనది. సదరు వివరములు తెలుగులో పూర్తిస్థాయిలో దిగువన ఇవ్వడమైనది సదరు నోటిఫికేషన్ యొక్క వివరములు తెలుగులో చదివి మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి చేసి ఎగ్జామ్ కు బాగా ప్రిపేర్ అయ్యి జాబ్ సాధించాలని కోరుకుంటూ మీ telugugovtjobsinfo.com

ఉద్యోగాలు ఖాళీల వివరములు

  • ఎస్సీ 87
  • ఎస్టి 57
  • ఓ బి సి 158
  • ఈడబ్ల్యూఎస్ 58
  • ఓపెన్ క్యాటగిరి 240
  • పి డబ్ల్యు బిడి (ఫిజికల్ డిజేబులిటీ) 68

విద్యార్హతలు

SBI PO NOTIFICATION IN TELUGU

  • ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి
  • డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు ఇంటర్వ్యూ నాటికి లేదా 30-04 -2025 నాటికి డిగ్రీ పూర్తి చేసినట్లు సర్టిఫికెట్ చూపించాలి
  • మెడికల్ ఇంజనీరింగ్ చార్టెడ్ అకౌంటెంట్ కాస్ట్ అకౌంటెంట్ మొదలైన డిగ్రీలు కూడా అప్లై చేసుకోవచ్చు.

వయోపరిమితి

  • SC/ST వారికి 5 సంవత్సరములు
  • ఓ బి సి వారికి మూడు సంవత్సరములు
  • ఫిజికల్ డిజేబులిటీ వారికి పది నుండి 15 సంవత్సరములు వయసు సడలింపు గలదు.

పి ఓ ఉద్యోగానికి ఎంపిక ప్రక్రియ

https://telugugovtjobsinfo.com/sbi-po-notification-in-telugu

పి ఓ ఉద్యోగానికి ఎంపిక ప్రక్రియ మూడు దశలలో ఉంటుంది

  • ప్రిలిమినేని ఎగ్జామినేషన్,ఈ పరీక్ష లో ఆబ్జెక్టివ్ టైప్ క్యూస్షన్స్ తో వంద మార్కులకు ఆన్లైన్ ద్వారా కండక్ట్ చేస్తారు.
  • ఇంగ్లీష్ భాష పై 40 ప్రశ్నలు
  • క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 30 ప్రశ్నలు
  • రీజనింగ్ ఎబిలిటీ 30 ప్రశ్నలు
  • ఒక్కొక్క పై విభాగానికి 20 నిమిషాలు చొప్పున గంట ఎగ్జామ్ నిర్వహించబడుతుంది.
  • ప్రతి తప్పు సమాధానం 1/4th మార్కు తీసివేయబడుతుంది
  • ఈ పరీక్షలు అత్యధిక మార్కులు సంపాదించిన అభ్యర్థులను సుమారు 10 టైమ్స్ మందిని తదుపరి మెయిన్ ఎగ్జామినేషన్ కు అర్హత పొందుతారు.
  • మెయిన్ ఎగ్జామినేషన్, ఈ పరీక్షలో 200 మార్కులకు ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు మరియు 50 మార్కులకు డిస్క్రిప్టివ్ ప్రశ్నలు ఉంటాయి.
  • 1. రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ పై 40 ప్రశ్నల 60 మార్కులు, 50 నిమిషములు వ్యవధి కలదు
  • 2. డేటా ఎనాలసిస్ మరియు ఇంటర్ప్రిటేషన్ పై 30 ప్రశ్నలు 60 మార్కులకు 45 నిమిషముల వ్యవధి కలదు
  • 3. జనరల్ అవేర్నెస్/ఎకానమీ/బ్యాంకింగ్ నాలెడ్జ్ పై 60 ప్రశ్నలు 60 మార్కులకు వ్యవధి 45 నిమిషములు కలదు
  • 4. ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై 40 ప్రశ్నలు 20 మార్కులకు 40 నిమిషములు వ్యవధి కలదు.
  • ప్రతి తప్పు సమాధానం 1/4th మార్కు తీసివేయబడుతుంది
  • 5. డిస్క్రిప్టివ్ పరీక్ష లో కమ్యూనికేషన్ స్కిల్స్, ఇమెయిల్, రిపోర్ట్స్, సిట్యువేషన్ అనాలసిస్ మొదలగును పై 50 మార్కులకు 30 నిమిషములు వ్యవధితో పరీక్ష జరుగును.
  • ఈ ఎగ్జామ్ కొరకు ఫేజ్- 2 లో అనగా మెయిన్ పరీక్ష నందు మెరిట్ ఆధారంగా ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులను సుమారు త్రీ టైమ్స్ నందిని షార్ట్ లిస్ట్ చేయబడుతుంది.
  • ఈ పేజ్ లో ఫిజోమెట్రిక్ టెస్ట్ గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ ఉంటాయి, . ఈ విధానం 50 మార్కులకు ఉంటుంది.

https://telugugovtjobsinfo.com/sbi-po-notification-in-telugu

  • ఫేజ్ – 2 మరియు ఫేజ్ – 3 లలో మార్కులను వందకి నార్మలైజ్ చేసి ఎక్కువ మార్కులు సంపాదించిన వారిని ఈ ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

జీతం

  • స్టార్టింగ్ బేసిక్ రూ 48,480/- లు మరియు నాలుగు అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ ప్లస్ డి ఎ ,హెచ్ ఆర్ ,సి సి ఏ, సిపిఎస్ మెడికల్ ఫెసిలిటీస్ మరియు ఇతర అలవెన్సెస్ ముంబై లాంటి సిటీలో స్టార్టింగ్ లో రూ18.67 లక్షలు గ్రాస్ అమౌంట్ శాలరీ అందుతుంది.

దరఖాస్తు రుసుము

  • జనరల్/EWS/OBC వర్గం అభ్యర్థులు: ₹750/-
  • SC/ST/PwBD : ఫీజు చెల్లించనవసరం లేదు.
  • జనరల్/EWS అభ్యర్థులు: 4 సార్లు
  • UR (PWBD ) ,EWS (PWBD ),OBC , అభ్యర్థులు: 7 సార్లు
  • SC/ST: ఎన్నిసార్లైనా ఎగ్జామ్ కు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చేయు విధానం

SBI వెబ్ సైట్ నందు ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా అప్లై చేసుకోవాలి

  • ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేది : 27.12.2024
  • ఆన్లైన్ అప్లికేషన్ ముగింపు తేది : 16.01.2025

పరీక్ష కేంద్రాలు

ఆంధ్రప్రదేశ్: చిత్తూరు, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు ,నెల్లూరు, ఒంగోలు ,రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం ,విజయనగరం.

తెలంగాణ: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం ,వరంగల్.

ఆంధ్రప్రదేశ్: గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం.

తెలంగాణ: హైదరాబాద్

NOTIFICATION
RE VISIT

Leave a Comment